హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో బీటెక్, బీఈ లాంటి కోర్సులు చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. భారతదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఈవీఎం, వీవీప్యాట్ నిర్వహణ, సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ లాంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 30 మధ్యాహ్నం 2 గంటలు
విద్యార్హత- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60% మార్కులతో పాస్ కావాలి.
అనుభవం- కంప్యూటర్ హార్డ్‌వేర్, లైనక్స్, విండోస్ ఓఎస్, నెట్వర్కింగ్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
హైదరాబాద్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వించే అడ్రస్:
Electronics Corporation Of India Limited,
Nalanda Complex, CLDC,
TIFR Road, Hyderabad- 500062.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.