ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

ECIL Jobs 2020 | హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 19, 2020, 1:40 PM IST
ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు
ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. భారతదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు దుర్గాపూర్, కొచ్చిన్, ముంద్రా, ముంబై, చెన్నై, చండీగఢ్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈసీఐఎల్. ఇవి ఏడాది కాంట్రాక్ట్ పోస్టులు. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి గడువు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఒక అభ్యర్థి ఒకే పోస్టుకు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SBI Jobs 2020: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

DRDO Jobs 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... నేరుగా ఇంటర్వ్యూ

ECIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే


మొత్తం ఖాళీలు- 17
హైదరాబాద్‌- 9
దుర్గాపూర్- 2కొచ్చిన్- 1
ముంద్రా- 1
ముంబై- 2
చండీగఢ్‌- 1
చెన్నై- 1

IBPS Clerk Jobs: మొత్తం 2557 బ్యాంకు జాబ్స్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు

Jobs: హైదరాబాద్, వైజాగ్‌లోని బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో జాబ్స్... మరో 3 రోజులే ఛాన్స్

ECIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 30
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ- త్వరలో తేదీలను వెల్లడించనున్న ఈసీఐఎల్
విద్యార్హతలు- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ లేదా బీఈ పాసైనవారు అప్లై చేయొచ్చు.
వయస్సు- 2020 ఆగస్ట్ 31 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- బీటెక్ లేదా బీఈలో వచ్చిన మార్కుల ఆధారంగా దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
Published by: Santhosh Kumar S
First published: September 19, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading