హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://careers.ecil.co.in/ లేదా http://www.ecil.co.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్లో తెలిపిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. పోస్టు ద్వారానే దరఖాస్తులు పంపాలి. నేరుగా ఈసీఐఎల్ ఆఫీసులో ఇవ్వకూడదు. నార్మల్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, కొరియర్ ద్వారా అప్లికేషన్ ఫామ్ పంపాలి.
AP Anganwadi Jobs 2020: అంగన్వాడీలో 855 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
SSC Recruitment 2020: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచారు... ఇంటర్ పాసైతే చాలు
మొత్తం ఖాళీలు- 15
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 4
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)- 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 2
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్చేస్)- 1
సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)- 2
సీనియర్ మేనేజర్ (లా)- 1
పర్సనల్ ఆఫీసర్- 1
అకౌంట్స్ ఆఫీసర్- 1
UPSC Jobs 2020: యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
SSC CGL 2020-21: డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... నోటిఫికేషన్ వివరాలు ఇవే
దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 31 సాయంత్రం 4 గంటలు
పోస్టులో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2021 జనవరి 11 సాయంత్రం 4 గంటలు
ఇంటర్వ్యూ తేదీ- త్వరలో వెల్లడించనున్న ఈసీఐఎల్.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ కావాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు- రూ.500
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ADDITIONAL GENERAL MANAGER & IN-CHARGE, HR
PERSONNEL GROUP, ADMINISTRATIVE OFFICE,
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED,
ECIL (POST), HYDERABAD – 500 062, TELANGANA.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu