ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో జాబ్స్... నవంబర్ 23న ఇంటర్వ్యూలు

ECIL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు www.ecil.co.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని నవంబర్ 23న ఉదయం 09:30 గంటల నుంచి 12:00 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

news18-telugu
Updated: November 21, 2019, 10:43 AM IST
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో జాబ్స్... నవంబర్ 23న ఇంటర్వ్యూలు
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో జాబ్స్... నవంబర్ 23న ఇంటర్వ్యూలు
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 10 ఖాళీలను ప్రకటించింది. టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆర్టిసన్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల కాలవ్యవధి ఏడాది మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువు పొడిగించే అవకాశముంది. అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు www.ecil.co.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని నవంబర్ 23న ఉదయం 09:30 గంటల నుంచి 12:00 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు జిరాక్స్ తీసుకెళ్లాలి. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ECIL Recruitment 2019: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 10
టెక్నికల్ ఆఫీసర్ (కేటగిరీ 1)- 01
టెక్నికల్ ఆఫీసర్ (కేటగిరీ 2)- 02
టెక్నికల్ ఆఫీసర్ (కేటగిరీ 3)- 01
టెక్నికల్ ఆఫీసర్ (కేటగిరీ 4)- 01జూనియర్ ఆర్టిసన్ (కేటగిరీ 1)- 04
జూనియర్ ఆర్టిసన్ (కేటగిరీ 2)- 01

ECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


విద్యార్హత- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్‌లో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, రేడియో & టీవీలో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెడ్ ఉండాలి.
వయస్సు- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు 25 ఏళ్లు.
వేతనం- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు నెలకు రూ.23,000, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు నెలకు రూ.16,770.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ- 2019 నవంబర్ 23
వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరిగే స్థలం:
ECIL Zonal Office,
# 1207,
Veer Savarkar Marg,
Dadar (Prbhadevi),
Mumbai - 400028.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్... అప్లికేషన్ లింక్ ఇదే

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్

TSSPDCL Syllabus: 3025 ఉద్యోగాలకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే

 
First published: November 21, 2019, 10:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading