ECIL HYDERABAD RECRUITMENT 2021 ELECTRONICS CORPORATION OF INDIA LIMITED RELEASED NOTIFICATION FOR 180 GRADUATE ENGINEER AND TECHNICIAN DIPLOMA APPRENTICE POSTS SS
హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్, టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 180 ఖాళీలున్నాయి. ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ యూనిట్లో ఒక ఏడాది అప్రెంటీస్‌షిప్ శిక్షణ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 15 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.ecil.co.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS వెబ్సైట్ http://www.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ECIL Hyderabad Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 180
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్- 160
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 100
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 25
మెకానికల్ ఇంజనీరింగ్- 20
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 10
సివిల్ ఇంజనీరింగ్- 5
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్- 20
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 10
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 10
ECIL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 6
NATS వెబ్సైట్లో దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 15 సాయంత్రం 4 గంటలు
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- 2021 జనవరి 18
మొదటి జాబితా అభ్యర్థులు చేరాల్సిన తేదీలు- 2021 జనవరి 20, 21
రెండో జాబితా విడుదల- 2021 జనవరి 28
రెండో జాబితా అభ్యర్థులు చేరాల్సిన తేదీలు- 2021 జనవరి 29, 30
అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ప్రారంభం- 2021 ఫిబ్రవరి 4
ECIL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ లేదా బీఈ పాస్ కావాలి. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి. 2018 ఏప్రిల్ 1 తర్వాత పాసైనవారే దరఖాస్తు చేయాలి.
వయస్సు- 2021 జనవరి 31 నాటికి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
వేతనం- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ పోస్టుకు రూ.9,000, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుకు రూ.8,000.
స్టెప్ 1 లో ముందుగా http://www.mhrdnats.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
Enroll పైన క్లిక్ చేయండి.
మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి.
యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది.
ఎన్రోల్మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు సమయం పడుతుంది. రెండో రోజు రెండో స్టెప్ అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 2 లో http://www.mhrdnats.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి.
ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి.
ECIL HYDERABAD అని టైప్ చేసి అప్లై చేయాలి.
ఆ తర్వాత రెండో స్టెప్ దరఖాస్తు పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.