హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆర్టిసన్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 111 ఖాళీలున్నాయి. మైసూరులోని ఈసీఐఎల్ యూనిట్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. నాలుగేళ్ల కాలానికి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈసీఐఎల్. నాలుగేళ్ల తర్వాత ప్రాజెక్ట్ అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 17, 18 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది. ఈసీఐఎల్ అధికారిక వెబ్సైట్ http://www.ecil.co.in/ లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ఇంటర్వ్యూకు హాజరు కావాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.ecil.co.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
HP Chromebook: ఆన్లైన్ క్లాసుల కోసం తక్కువ ధరలో టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్
MES Recruitment 2021: డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి 502 ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు
మొత్తం ఖాళీలు- 111
సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 86
ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్- 6
ఎలక్ట్రికల్- 6
మెకానికల్- 6
కెమికల్- 6
జూనియర్ ఆర్టిసన్- 24
ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్- 18
ఎలక్ట్రికల్- 30
ఫిట్టర్- 20
కెమికల్ ప్లాంట్ ఆపరేటర్- 18
ఆఫీస్ అసిస్టెంట్- 1
NTA Recruitment 2021: మొత్తం 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు
ఇంటర్వ్యూ తేదీ- జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు 2021 ఏప్రిల్ 17, ఆఫీస్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టులకు ఏప్రిల్ 18న ఇంటర్వ్యూలు ఉంటాయి. ఉదయం 10 గంటల్లోపు రిపోర్ట్ చేయాలి.
విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పాస్ కావాలి. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయస్సు- 2021 మార్చి 31 నాటికి 25 ఏళ్లు. ఐదేళ్లు అనుభవం ఉన్నవారికి వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- మెరిట్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
వేతనం- జూనియర్ ఆర్టిసన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,802, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.18,882.
ఇంటర్వ్యూ జరిగే స్థలం-
Atomic Energy Central School,
RMP Yelwal Colony, Hunsur Road,
Yelwal Post, Mysore - 571130
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, ECIL, Exams, Govt Jobs 2021, Hyderabad, Hyderabad news, Job notification, JOBS, NOTIFICATION