ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 64 ఉద్యోగాలు... జనవరి 4 లాస్ట్ డేట్

ECIL Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 4 చివరి తేదీ.

news18-telugu
Updated: January 1, 2020, 7:13 PM IST
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 64 ఉద్యోగాలు... జనవరి 4 లాస్ట్ డేట్
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 64 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలను నియమిస్తోంది. మొత్తం 64 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 4 చివరి తేదీ. గేట్ 2018, గేట్ 2019 స్కోర్స్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఈసీఐఎల్. గేట్ స్కోర్ ద్వారా దరఖాస్తుల్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 64

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 30
మెకానికల్ ఇంజనీరింగ్- 24
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 10


దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 6దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 4
విద్యార్హత- సంబంధిత విభాగంలో 65% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో సెకండ్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ 2018, గేట్ 2019 స్కోర్ ఉండాలి.
స్టైపెండ్- ఏడాది శిక్షణ కాలంలో రూ.48,160. శిక్షణ తర్వాత మొదటి ఏడాది రూ.67,920. రెండో ఏడాది రూ.69,960. మూడో ఏడాది రూ.72,060.
ఈసీఐఎల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ... ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: January 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>