BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు..

బీఈసీఐఎల్ జాబ్స్‌

బ్రాడ్‌కాస్టింగ్ ఇంజనీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (Broadcast Engineering Consultants India Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 7, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  • Share this:
    బ్రాడ్‌కాస్టింగ్ ఇంజనీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (Broadcast Engineering Consultants India Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా హ్యండీమెన్‌, డేటాఎంట్రీ ఆప‌రేట‌ర్ (Data Entry Operator), సూప‌ర్‌వైజ‌ర్‌, సీనియ‌ర్ సూప‌ర్ వైజ‌ర్  (Senior Supervisor) విభాగాల్లో 103 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 7, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://www.becil.com/vacancies ను సంద‌ర్శించండి. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌రిష్ట వ‌య‌సు 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ‌ర‌కు ఉంది.

    పోస్టుల స‌మ‌చాచారం..




























    పోస్టు పేరు అర్హ‌త‌లు ఖాళీలు
    హ్యాండీమెన్ ఎనిమిదో త‌ర‌గ‌తి పాసై ఉండాలి. స్థానిక భాష‌పై ప‌ట్టు ఉండాలి. హిందీలో మాట్లాడం రావాలి వ‌య‌సు 45 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. 67
    డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ గ్రాడ్యుయేష‌న్ చేసి ఉండాలి. కంప్యూట‌ర ప‌రీజ్ఞానం ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. 07
    సూప‌ర్ వైజ‌ర్‌ గ్రాడ్యుయేష‌న్ చేసి ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు 20
    సీనియ‌ర్ సూజ‌ర్ వైజ‌ర్‌ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. 09

    CSIR-NCL : ఎన్‌సీఎల్‌లో ప్రాజెక్టు ఇంజ‌నీర్ ఉద్యోగాలు.. జీతం రూ.31,000


    ఎంపిక విధానం..
    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుకు ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
    - ప‌రీక్ష పాసైన వారి ద‌ర‌ఖాస్తులు, అర్హ‌త‌లు ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు.
    - పోస్టుకు అవ‌సర‌మైన అర్హ‌త‌లు క‌చ్చితంగా ఉండాలి. ఎంపిక‌లో వాటికి ప్రాధాన్య‌త ఉంటుంది.

    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..
    - కేవ‌లం ఆన్‌లైన్ ద్వారా మాత్ర‌మే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - ముందుగా అభ్య‌ర్థి అధికారిక వెబ్‌సైట్ https://www.becil.com/vacancies ను సంద‌ర్శించాలి.
    - అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)
    - నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా అప్లె చేసుకోవ‌డానికి https://becilregistration.com/Home/ListofExam.aspx లింక్‌ను ఓపెన్ చేయాలి.
    - అనంత‌రం పూర్తి వివ‌రాల‌ను అందించి సబ్‌మిట్ చేయాలి.
    - జ‌న‌ర‌ల్/ ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.750 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థ‌ల‌కు రూ.450 ఫీజు
    - ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 7, 2021
    Published by:Sharath Chandra
    First published: