Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

Eastern Railway Recruitment 2020 | ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో మొత్తం 2792 పోస్టుల్ని భర్తీ చేస్తారు. పూర్తి వివరాలను http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: February 25, 2020, 3:18 PM IST
Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల 2792 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2020 ఫిబ్రవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. మార్చి 13 చివరి తేదీగా ప్రకటించింది ఈస్టర్న్ రైల్వే. అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తేదీలను సవరిస్తూ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం 2020 మార్చి 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 4 చివరి తేదీ. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో మొత్తం 2792 పోస్టుల్ని భర్తీ చేస్తారు. పూర్తి వివరాలను http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Eastern Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 2792
ఫిట్టర్- 1070
వెల్డర్-547
మెకానిక్ (ఎంవీ)- 9
మెకానిక్ (డీజిల్)- 123బ్లాక్‌స్మిత్- 9
మెషినిస్ట్- 74
కార్పెంటర్ -20
పెయింటర్- 26
లైన్‌మ్యాన్- 49
వైర్‌మ్యాన్- 67
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54
ఎలక్ట్రీషియన్- 593
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75
టర్నర్- 67

Eastern Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 27
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 4
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.
అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు తేదీలను సవరిస్తూ జారీ చేసిన నోటీసు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు... అప్లై చేయండిలా

Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో యాంత్రిక్ పోస్టుల భర్తీ... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: February 25, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading