హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Eastern Railway Apprentice Recruitment 2020 | అర్హతలు ఉన్నవారికి భారతీయ రైల్వేలో వరుసగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా వేల సంఖ్యలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ జరుగుతోంది. ఈస్టర్న్ రైల్వే 2792 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇంకా చదవండి ...

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన నోటిఫికేషన్లకు నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు రైల్వేకు చెందిన వివిధ జోన్లు వేరుగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. పశ్చిమ మధ్య రైల్వే 570 ఉద్యోగాలకు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 447 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. ఇప్పుడు ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Eastern Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 2792

ఫిట్టర్- 1070

వెల్డర్-547

మెకానిక్ (ఎంవీ)- 9

మెకానిక్ (డీజిల్)- 123

బ్లాక్‌స్మిత్- 9

మెషినిస్ట్- 74

కార్పెంటర్ -20

పెయింటర్- 26

లైన్‌మ్యాన్- 49

వైర్‌మ్యాన్- 67

రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54

ఎలక్ట్రీషియన్- 593

మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75

టర్నర్- 67

Eastern Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 27

దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 14

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 13 సాయంత్రం 6.30 గంటలు

అభ్యర్థుల ఎంపిక- 2020 మార్చి 30

విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.

అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Axis Bank Jobs: ఈ కోర్సు పాసైతే యాక్సిస్ బ్యాంకులో జాబ్ గ్యారెంటీ

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 317 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ అర్హత

ISRO Jobs: ఇస్రోలో 183 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

ఉత్తమ కథలు