Railway Jobs: భారతీయ రైల్వేలో 2,945 పోస్టులు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

Railway Jobs: భారతీయ రైల్వేలో 2,945 పోస్టులు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs | ఈస్టర్న్ రైల్వే పరిధిలో 2945 పోస్టుల (Railway Jobs) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వేలో ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఈస్టర్న్ రైల్వే భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2,945 ఖాళీలు ఉన్నాయి. వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, లైన్‌మెన్, వైర్‌మెన్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. అప్రెంటీస్ యాక్ట్-1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఈ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈస్టర్న్ రైల్వే. ఇవి ఏడాది గడువు గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    Indian Navy Recruitment 2021: ఇంటర్ పాస్ అయినవారికి అలర్ట్... ఇండియన్ నేవీలో బీటెక్ చేయండిలా

    Eastern Railway RRC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





























































     మొత్తం ఖాళీలు  2,945
     ఫిట్టర్  1,246
    టర్నర్  57
     వెల్డర్  447
     మెకానికల్ (ఎంవీ  18
     మెకానికల్ (డీజిల్)  98
     కార్పెంటర్   19
     పెయింటర్ 22
     లైన్‌మ్యాన్ (జనరల్)  49
     వైర్‌మ్యాన్  107
     రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్  417
     ఎలక్ట్రీషియన్  396
     మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్  9
     మెషినిస్ట్  58

    APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 54 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

    Eastern Railway RRC Recruitment 2021: డివిజన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే...





































    మొత్తం ఖాళీలు మొత్తం ఖాళీలు
    హౌరా 659
    సెల్దాహ్ 1123
    అసనోల్ 167
    మాల్దా 43
    కంచ్రపర 190
    లిలుహా 85
    జమాల్‌పూర్ 678

    SBI SO Recruitment 2021: రూ.2,00,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... మేనేజర్ పోస్టులకు అప్లై చేయండిలా

    Eastern Railway RRC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4 ఉదయం 10 గంటలు

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 3 సాయంత్రం 6 గంటలు

    మెరిట్ లిస్ట్ విడుదల- 2021 నవంబర్ 18

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

    వయస్సు- 15 నుంచి 24 ఏళ్ల లోపు

    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 151 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

    Eastern Railway RRC Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో అప్రెంటీస్ నోటిఫికేషన్ ఉంటుంది.

    Step 3- నోటిఫికేషన్ కింద అప్లికేషన్ లింక్ ఉంటుంది. క్లిక్ చేయాలి.

    Step 4- అభ్యర్థులు పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 5- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

    Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

    Step 7- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: