Home /News /jobs /

EAST COAST RAILWAY RECRUITMENT 2022 WALK IN INTERVIEW FOR GROUP C POSTS HERE FULL DETAILS NS

East Coast Railway Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో జాబ్స్.. నేరుగా ఇంటర్వ్యూలే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

    ఇండియన్ రైల్వే (Indian Railway) ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను (Railway Jobs Notification) విడుదల చేస్తోంది. తాజాగా గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఈ ఉద్యోగాలకు (Railway Jobs) అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను జనవరి 31న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు భారీగా హాజరైతే కరోనా నేపథ్యంలో ఇంటర్వ్యూలను రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    నర్సింగ్ సూపరింటెండెంట్: ఈ విభాగంలో మొత్తం 7 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఖాళీలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు మూడేళ్ల నర్సింగ్ కోర్సును (BSc Nursing) పూర్తి చేసి ఉండాలి. ఇంకా నర్స్ గా రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
    ఫార్మసిస్ట్: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంది. అభ్యర్థులు 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. ఇంకా రెండేళ్ల ఫార్మసీ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
    BSNL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    వయో పరిమితి:
    నర్సింగ్ సూపరింటెండ్ అభ్యర్థులు 20-40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
    ఫార్మసిస్ట్: ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20-35 ఏళ్లు కలిగి ఉండాలి.



    ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ గడువు మార్చ్ 31 వరకు ఉంటుంది. కరోనా పరిస్థితుల ఆధారంగా ఈ కాంట్రాక్ట్ ను పొడిగించే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.
    వేతనాల వివరాలు: నర్సింగ్ సూపరింటెండ్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 44,900 వేతనం చెల్లించనున్నారు. ఫార్మసిస్ట్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.29,200 వేతనం చెల్లించనున్నారు.
    ఇంటర్వ్యూ వేధిక: Udayagiri Meeting Hall, 2nd floor, south block, rail sadan, ECoR/Hqs/Chandrasekharpur, Bhubaneswar
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు