EAST CENTRAL RAILWAY INVITES APPLICATIONS FOR 447 PEON JUNIOR CLERK AND OTHER POSTS APPLY BEFORE FEBRUARY 20 SS
Railway Jobs: రైల్వేలో 447 ప్యూన్, జూనియర్ క్లర్క్ జాబ్స్... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్
Railway Jobs: రైల్వేలో 447 ప్యూన్, జూనియర్ క్లర్క్ జాబ్స్... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)
East Central Railway Recruitment 2020 | రైల్వేలో ఉద్యోగం కోరుకుంటున్నారా? ప్యూన్, క్లర్క్ లాంటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారా? ఈస్ట్ సెంట్రల్ రైల్వే 447 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది.
భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే 447 ప్యూన్, జూనియర్ క్లర్క్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పాట్నా కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే వేర్వేరు యూనిట్ల కోసం వీరిని నియమించుకుంటోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. గరిష్టంగా 4 ఏళ్లు ఈ పోస్టులుంటాయి. పరిపాలనా అవసరాలను బట్టి 8 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు 2020 ఫిబ్రవరి 20 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://ecr.indianrailways.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
East Central Railway Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 447
సివిల్- 279
ఎస్ అండ్ టీ- 132
ఎలక్ట్రికల్స్ అండ్ కన్స్ట్రక్షన్- 36
దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 20
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.