• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • EAMCET RESULT 2019 TS AP EAMCET RESULTS IS EXPECTED SOON CHECK HERE FULL DETAILS RA

EAMCET Results 2019 : జూన్‌ మొదటివారంలోనే TS, AP EAMCET Results.. ఇలా చెక్ చేసుకోండి..

EAMCET Results 2019 : జూన్‌ మొదటివారంలోనే TS, AP EAMCET Results.. ఇలా చెక్ చేసుకోండి..

త్వరలోనే TS, AP EAMCET Results..

EAMCET Results 2019 | త్వరలోనే రీవాల్యూయేషన్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఆ వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు ఎంసెట్ ర్యాంకులు ప్రకటించనున్నారు.  రీ వాల్యూయేషన్ ఫలితాలను ప్రకటించడంతో పాటు ఆ విద్యార్థులు జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    TS, AP Eamcet results  జూన్ మొదటివారంలో విడుదలకానున్నాయి. వాస్తవానికీ తెలుగురాష్ట్రాల్లో ఎప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ విడుదల కావాల్సింది. అయితే, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌‌లో ఏర్పడిన గందరగోళం వల్ల రీ వాల్యూయేషన్ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మే 27 తర్వాతే రిజల్ట్స్ రిలీజ్ అంటూ తెలిపాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు. ఈ కారణంగానే త్వరలోనే రిజల్ట్స్ రిలీజ్ కానున్నాయి.

    త్వరలోనే రీవాల్యూయేషన్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఆ వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు ఎంసెట్ ర్యాంకులు ప్రకటించనున్నారు.  రీ వాల్యూయేషన్ ఫలితాలను ప్రకటించడంతో పాటు ఆ విద్యార్థులు జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఇంటర్ మార్కులకు ఎంసెట్ ర్యాంకుల్లో వెయిటేజీ ఉండటంతో ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదని, రీవెరిఫికేషన్ మార్కుల్లో తేడాలొస్తే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ మారి, ర్యాంకులు మారే ప్రమాదముందని.. అందుకే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాకే ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు.

    read this : Indian Army : ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.. ఎంపికైన వారికి ట్రైనింగ్ అనంతరం 

    ఎంసెట్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి.

    స్టెప్ 1 : ముందుగా ఏ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు ఆ రాష్ట్ర అఫీషియల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

    స్టెప్ 2 : ఏపీ స్టూడెంట్స్ sche.ap.gov.in కి, తెలంగాణ స్టూడెంట్స్ eamcet.tshe.gov.inకి లాగిన్ అవ్వాలి.

    స్టెప్ 3 : ఇందులో  ts eamcet results 2019, ap eamcet result 2019 అనే ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి.

    స్టెప్ 4 : కావాల్సిన డిటెయిల్స్  ఎంటర్ చేయాలి.

    స్టెప్ 5 : సబ్‌మిట్ చేశాక..రిజల్ట్స్ ప్రత్యక్షమవుతాయి.

    స్టెప్ 6 : ఇప్పుడు రిజల్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి..ప్రింట్ తీసుకోండి.

    ఈ సంవత్సరం ఏపీ ఎంసెట్ 2019  ఎగ్జామ్‌ని కాకినాడ జేఎన్‌టీయూ ఏప్రిల్ 20 నుంచి 24 వరకూ నిర్వహించగా.. టీఎస్ ఎంసెట్ 2019 ఎగ్జామ్‌ని హైదరాబాద్ జేఎన్‌టీయూ మే 3 నుంచి మే 9 వరకు నిర్వహించింది.

    ఇవి కూడా చదవండి..

    Govt Jobs : Vizag Steel‌లో మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు ఇవే..
    First published: