Telangana Eamcet: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు

TS Eamcet News: ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను రేపటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

news18-telugu
Updated: September 2, 2020, 7:08 PM IST
Telangana Eamcet: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TS Eamcet: తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబ‌ర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం తెలంగాణలో 79, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి జరగబోయే ఎంసెట్ పరీక్షకు 1,43,165 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇక ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లకు రేపటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం www.eamcet.tsche.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలని జేఎన్టీయూ తెలిపింది.

ఇక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. రెండు రోజుల నుంచి జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలకు సైతం అదే తరహాలో ఏర్పాట్లు చేయనున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 2, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading