EAMCET Counselling : ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి..కౌన్సెలింగ్‌కి సిద్ధమవ్వండిలా..

EAMCET Counselling | గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీల్లో ఎంట్రెన్స్ డీటెయిల్స్, కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ విధానం ఎలా జరుగుతుందంటే..

news18-telugu
Updated: June 9, 2019, 12:40 PM IST
EAMCET Counselling : ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి..కౌన్సెలింగ్‌కి సిద్ధమవ్వండిలా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 9, 2019, 12:40 PM IST
తెలుగురాష్ట్రాల్లో ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. దీనిపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కారణంగా వెబ్‌ కౌన్సెలింగ్ గురించి అన్నీ విషయాలు తెలుసుకోవచ్చు.. గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీల్లో ఎంట్రెన్స్ డీటెయిల్స్, కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ విధానం ఎలా జరుగుతుందంటే..

ముందుగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్..
ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు రుగుతంది. ఇందుకు ముందుగా ఆన్‌లైన్‌‌లో వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది. దీనికోసం స్టూడెంట్స్ తమ హాల్‌టికెట్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ మిగిలిన వివరాలతో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం.. అదే వెబ్‌సైట్‌లో కాలేజీలు, బ్రాంచ్‌ల జాబితాను పరిశీలించి.. కాలేజీ, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో పేర్కోవాలి. ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక నిర్ణీత గడువు తర్వాత అభ్యర్థి ప్రాథమ్యాలు, ఎంసెట్‌లో పొందిన ర్యాంకు. అందులోని సీట్ల ఆధారంగా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. అభ్యర్థులు ఇలా తాము కోరుకున్న విధంగానే సీట్ అలాట్‌మెంట్ జరిగితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ తమకు లభించిన బ్రాంచ్ లేదా కాలేజీ నచ్చకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. వీరికి తదుపరి దశలో నిర్వహించే కౌన్సెలింగ్‌లో స్లైడింగ్ అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తొలిదశలో తమకు లభించిన సీటుని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే రెండోసారి కౌన్సెలింగ్‌లో తాజా అభ్యర్థిగా పరిగణిస్తారు.

రెండు విధానాల్లో సీట్ల భర్తీ..
ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లోని సీట్ల భర్తీకి ప్రభుత్వం ప్రస్తుతం కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా అనే రెండు విధానాలను అనుసరిస్తోంది.



కన్వీనర్ కోటా :
కన్వీనర్ కోటాలో భాగంగా గవర్నమెంట్ కాలేజీల్లోని మొత్తం సీట్లను ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
Loading...
ప్రైవేట్ కాలేజీ‌ల్లోని 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ఎంసెట్ ర్యాంక్ ఆధరాంగా భర్తీ చేస్తారు. మిగతా.. 30 శాతం సీట్లను సదరు కాలేజీల యాజమాన్యాలు బి కేటగిరీ పేరుతో భర్తీచేసుకోవచ్చు. ఈ 30శాతం మేనేజ్‌మెంట్ కోటాలో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీ..
ఈ ప్రక్రియలో 15 శాతం ఎన్‌ఆర్ఐ కోటా సీట్లు ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేస్తున్న విద్యార్థులకు ఉంటాయి. వీటిలో ప్రవేశం పొందేందుకు ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. లేదా.. స్కేలింగ్ విధానం ప్రకారం 10 సీజీపీఏ స్కేలింగ్‌లో 5 సీజీపీఏ సాధించాలి.

యాజమాన్య సీట్లు :
ఎన్‌ఆర్ఐ కోటా కింద కేటాయించిన 15 శాతం సీట్లు పోగా.. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునే వీలుంది. వీటిలో ప్రవేశం పొందేందుకు ఎంసెట్లో ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో 50 శాతం మార్కులు సాధించినవారై ఉండాలి.
ఆ తర్వాత మిగిలిన సీట్లని ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు.
ఈ రెండింటి తర్వాత కూడా సీట్లు మిగిలితే ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లో 45 శాతం మార్కులు, (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు) పొందిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

ఏపీ విద్యార్థులకు మాక్ కౌన్సెలింగ్
ఈ ఏడాది నుంచి ఏపీ ఎంసెట్ విద్యార్థులకు మాక్ కౌన్సెలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు తాము పొందిన ర్యాంకు ఆధారరంగా.. ఏయే కాలేజీల్లో సీటు లభించే అవకాశం ఉంటుందో ముందుగానే ఓ అంచనాకు రావొచ్చు. ఇది వెబ్ కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్స్ ఎంటీ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

TS EAMCET 2019 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...