Home /News /jobs /

DUE TO THE ADJUSTMENT OF VROS THE NUMBER OF VACANCIES IN GROUP 3 AND GROUP 4 JOB NOTIFICATION IN TELANGANA IS LIKELY TO DECREASE VB

TSPSC Group 4-Group 3: నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన వీఆర్ఓల సర్దుబాటు..! తగ్గనున్న గ్రూప్ 4, గ్రూప్ 3 పోస్టులు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మార్చి నెలలో అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను వెల్లడిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు(Telangana CM) మార్చి నెలలో అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను(Job Notifications) వెల్లడిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో ఇప్పటి వరకు 45వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి వచ్చింది. అయినా నోటిఫికేషన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. పోలీస్(Police), గ్రూప్ 1(Group 1)  పోస్టులు మినహా ఇంత భారీ మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటి వరకు రాలేదు. ఇటీవల మోటార్ ఇన్ స్పెక్టర్, ఫుడ్ ఇన్ స్పెక్టర్, డివిజన్ అకౌంట్ ఆఫీర్ వంటి వాటికి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అయితే ఈ పోస్టులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో.. నిరుద్యోగులు ఎక్కువగా గ్రూప్ 4 ఉద్యోగాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువ ఉద్యోగాల భర్తీ దీనిలో జరగనున్నాయి.

Zoom India Jobs: జూమ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు..


9168 ఖాళీలు ఉన్న గ్రూప్ 4 నోటిఫికేషన్ జూన్ నెలలో వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయా శాఖల అధికారులు ఖాళీల వివరాలను టీఎస్పీఎస్సీకి పంపించడంలో తప్పులు దొర్లాయి. దీంతో మళ్లీ మరోసారి స్పష్టంగా పంపమని తిరిగి ఫైళ్లను పంపడంతో ఇంత వరకు ఆ పోస్టుల భర్తీ ప్రక్రియపై ఎలాంటి సమాచారం రాలేదు. ఇదంతా ఇలా ఉండగా.. వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి తొల‌‌గిస్తూ ఇటీవల జీవో నం.121ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వీఆర్ఓలను వేరే శాఖలకు కేటాయించారు. రెవెన్యూ శాఖ ప‌రిధిలో ఉన్న వీఆర్వోల‌ను ఆ శాఖ మిన‌హా మిగ‌తా శాఖ‌ల్లోని ఖాళీల్లోకి స‌ర్దుబాటు చేయాల‌ంటూ ప్ర‌భుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ శాఖ, మున్సిపల్ వార్డు అధికారులుగా వీఆర్ఓలకు అపాయింట్ మెంట్స్ ఇచ్చారు.



దాదాపు 99 శాతం మంది వీఆర్ఓలు వారికి కేటాయించిన శాఖల్లో జాయిన్ అయ్యారు. అయితే ఈ వీఆర్వోలను సర్దుబాటు చేసే క్రమంలో.. జూనియర్ అసిస్టెంట్ , కంప్యూటర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టుల్లో వీరిని నియమిస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూప్ 4 క్యాడర్ కు సంబంధించినవి కావడంతో.. నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 4లో ఖాళీలను ప్రకటించిన వాటి కంటే కూడా ఈ పోస్టులు తగ్గుతాయేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. కొన్ని జిల్లాలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులల్లో కూడా వీఆర్ఓలకు అపాయింట్ మెంట్స్ ఇస్తున్నారు. గ్రూప్ 3 క్యాడర్ పోస్టులు కూడా ఈ వీఆర్ఓలకు కేటాయిస్తుడటంతో గ్రూప్ 3లో ప్రకటించిన 1,373 ఉద్యోగాలు కూడా తగ్గించే అవకాశం ఉందంటూ నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Top 10 Medical Colleges: మెడిసిన్ చదవాలనుకుంటున్నారా..? అయితే టాప్ 10 మెడికల్ కాలేజీలు ఏవో తెలుసుకోండి..


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ఖాళీ ప్రకటనతో చాలామంది ఎక్కువగా గ్రూప్ 4, గ్రూప్ 3 వంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారు. ఇలా వీఆర్ఓల సర్దుబాటుతో ఖాళీలు తగ్గే అవకాశం కనిపిస్తుండటంతో కోచింగ్ లు తీసుకుంటున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 9 వేలకు పైగా గ్రూప్ 4 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీఆర్వోలను సర్దు బాటు చేస్తే ఇక మిగిలేది కేవలం 4 వేల పోస్టులే. ఇదే ఇప్పుడు నిరుద్యోగుల ఆగ్రహనికి కారణమైంది.

Deloitte India Career: డెలాయిట్(Deloitte)లో ఉద్యోగాలు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ ఇలా..


ఐదు వేల మందికిపైగా ఉన్న వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేస్తే తమకు మిగిలే పోస్టులు ఎన్ని అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాల మొత్తానికి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీఆర్వోల సర్దుబాటు చేసేందుకు కొత్తగా పోస్టులు స్పష్టించాలని సూచిస్తున్నారు. అయితే.. గ్రూప్ 4లో ప్రకటించిన ఖాళీల కంటే కూడా అదనంగా మరో 5వేల పోస్టులు ఉన్నాయని.. వీఆర్ఓల సర్దుబాటు కారణంగా గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల్లో ఎలాంటి తగ్గుదల ఉండకపోవచ్చని సమాచారం.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Group 3, Group 4, JOBS, Multi zonal in tspsc, Telangana government jobs, TSPSC, Tspsc jobs

తదుపరి వార్తలు