DSSSB Recruitment | నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ (Delhi) సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టుల దరఖాస్తుకు ఫిబ్రవరి 9, 2022 వరకు అవకాశం ఉంది.
నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (National Capital Territory of Delhi) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ (Delhi) సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు ( Delhi Subordinate Services Selection Board)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ విభాగంలో 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 10, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ (Notification) లో పేర్కొన్నారు. అప్లికేషన్ ప్రాసెస్, పోస్టుల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ dsssb.delhi.gov.in ను సందర్శించాలి. పోస్టుల దరఖాస్తుకు ఫిబ్రవరి 9, 2022 వరకు అవకాశం ఉంది.
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- మొదటగా టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు.
- ఉత్తీర్ణులైన వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- అనంతరం టైర్- 2 పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 6 : తప్పులు లేకుండా దరఖాస్తు ఫాంను పూరించాలి.
Step 7 : అనంతరం అప్లికేషన్ ప్రివ్యూ చూసి తప్పులు లేకుంటే సబ్మిట్ చేయాలి.
Step 8 : ఒక దరఖాస్తు కాపీని ప్రింట్ తీసి దాచుకోవాలి.
Step 9 : దరఖాస్తుకు ఫిబ్రవరి 9, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.