Home /News /jobs /

DSSSB RECRUITMENT 2022 DELHI SUBORDINATE SERVICES SELECTION BOARD RELEASED JOB NOTIFICATIONS FOR 878 VACANCIES KNOW HOW TO APPLY SS

DSSSB Recruitment 2022: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో భారీగా ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DSSSB Recruitment 2022: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో భారీగా ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

DSSSB Recruitment 2022: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో భారీగా ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

DSSSB Recruitment 2022 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) మొత్తం 878 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 878 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 జనవరి 10న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు జాబ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    DSSSB Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...









































    మొత్తం ఖాళీలు878విద్యార్హతలువేతనం
    జూనియర్ ఇంజనీర్ (సివిల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (సివిల్)575సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.
    అసిస్టెంట్ లా ఆఫీసర్ లేదా లీగల్ అసిస్టెంట్26న్యాయశాస్త్రంలో డిగ్రీ పాస్ కావాలి. లీగల్ ప్రాక్టీషియనర్‌గా ఒక ఏడాది అనుభవం తప్పనిసరి.రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.
    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)10ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.
    అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)151సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.
    జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)116ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.

    Top 7 Job Skills: 2022 లో జాబ్ మార్కెట్‌లో ఈ 7 స్కిల్స్‌కు ఫుల్ డిమాండ్

    DSSSB Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 10

    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 9

    పరీక్ష తేదీ- 2022 మార్చి 1

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు

    ఎంపిక విధానం- టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్

    దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు.

    జూనియర్ ఇంజనీర్ (సివిల్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అసిస్టెంట్ లా ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    UPSC Recruitment 2022: మొత్తం 187 ఖాళీలతో యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... అప్లై చేయండి ఇలా

    DSSSB Recruitment 2022: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో పైన వెల్లడించిన నోటిఫికేషన్లపైన క్లిక్ చేయాలి.

    Step 3- దరఖాస్తు లింక్ 2022 జనవరి 10 నుంచి అందుబాటులో ఉంటుంది.
    లేదా అభ్యర్థులు నేరుగా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 4- Click for New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 5- పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

    Step 6- విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 7- ఆ తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

    Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు