DSSSB RECRUITMENT 2021 DELHI SUBORDINATE SERVICES SELECTION BOARD BEGINS APPLICATION PROCESS FOR 5807 TGT POSTS SS
Teacher Jobs 2021: మొత్తం 5,807 టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం
Teacher Jobs 2021: మొత్తం 5,807 టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)
Teacher Jobs 2021 | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB భారీగా టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 5,807 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుల్ని ప్రకటించింది. ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, సంస్కృతం లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 3 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను DSSSB అధికారిక వెబ్సైట్ https://dsssb.delhi.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://dsssbonline.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
DSSSB TGT Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 5,807
టీజీటీ సంస్కృతం ఫీమేల్- 1,159
టీజీటీ సంస్కృతం మేల్- 866
టీజీటీ ఇంగ్లీష్ మేల్- 1,029
టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్- 961
టీజీటీ ఉర్దూ ఫీమేల్- 571
టీజీటీ ఉర్దూ మేల్- 346
టీజీటీ పంజాబీ ఫీమేల్- 492
టీజీటీ పంజాబీ మేల్- 382
టీజీటీ బెంగాలీ ఫీమేల్- 1
అభ్యర్థులు https://dsssb.delhi.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో LINK FOR ONLINE APPLICATION REGISTRATION SYSTEM (OARS) లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Click for New Registration పైన క్లిక్ చేయాలి.
అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.