DRONE PILOT HOW TO BECOME A DRONE PILOT 150 SCHOOLS FOR TRAINING IN THE COUNTRY BY 2025 FOR DORNE TRAINING EVK
Drone Pilot: డ్రోన్ పైలెట్ అవ్వడం ఎలా.. 2025 నాటికి దేశంలో శిక్షణకు 150 స్కూల్స్!
(ప్రతీకాత్మక చిత్రం)
Drone Pilot | దేశీయ అవసరాలకు భవిష్యత్‌లో డ్రోన్ పైలెట్లు చాలా ముఖ్యం. దాదాపుగా కొన్నేళ్లేలో డ్రోన్ వ్యవస్థ రూ. 30,000 కోట్లకు పైగా పరిశ్రమగా రూపుదిద్దుకొంటుందని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
దేశీయ అవసరాలకు భవిష్యత్‌లో డ్రోన్ పైలెట్ (Drone Pilot) లు చాలా ముఖ్యం. దాదాపుగా కొన్నేళ్లేలో డ్రోన్ వ్యవస్థ రూ. 30,000 కోట్లకు పైగా పరిశ్రమగా రూపుదిద్దుకొంటుందని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డ్రోన్ డెస్టినేషన్ సీఈవో చిరాగ్ శర్మ తెలిపారు. ఇందుకోసం యూనివర్సిటీలు, వ్యవసాయ రంగ సంస్థలు, పోలీస్ అకాడమీలతో చేతులు కలపనున్నట్లు వివరించారు. దేశంలో తొలి రిమోట్ పైలట్ ట్రైనింగ్ సంస్థగా డ్రోన్ డెస్టినేషన్ .. అనుమతులు పొందింది. ప్రస్తుతం ఆరు స్కూల్స్ (Schools) ను నిర్వహిస్తోంది. త్వరలో కోయంబత్తూర్, మదురైలో మరో రెండు ప్రారంభించనున్నట్లు శర్మ పేర్కొన్నారు.
- కానీ ఇతర రకాల డ్రోన్లను ఆపరేట్ చేయడానికి - లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ వర్గంలో ఏదైనా --
- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ద్వారా అధికారం పొందిన సంస్థ నుంచి లైసెన్స్ మరియు శిక్షణ పొందాలి. - నోటిఫై చేయబడిన నిబంధనల ప్రకారం, అన్ని డ్రోన్ శిక్షణ మరియు పరీక్షలు అధీకృత డ్రోన్ పాఠశాలచే నిర్వహించబడతాయి.
వచ్చే ఏడాది 2000 మందికి శిక్షణ..
గడిచిన కొన్ని నెలలుగా తాము 500 మంది పైలట్లకు శిక్షణ కల్పించినట్లు వివరించారు. రాబోయే ఏడాది కాలంలో గురుగ్రామ్ కేంద్రంలో 1,500 – 2,000 మంది పైలట్లకు, మిగతా కేంద్రాల నుంచి తలో 500 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శర్మ తెలిపారు.
డ్రోన్ల ద్వారా ప్రభుత్వాలకు ఎదురయ్యే "ముఖ్యమైన ముప్పు" గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం డ్రోన్ వ్యతిరేక సాంకేతికత యొక్క సమూహాన్ని సృష్టించి, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను యాక్సెస్ చేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యల గురించి కూడా కమిటీ రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరిందని తెలిపారు. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలు ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ జోన్లను నియమించినట్లు చెప్పారు. అయితే మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లు ఇంకా ఈ జోన్ల ఏర్పాటు ప్రక్రియలోనే ఉన్నాయని కమిటీకి తెలియజేసింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.