ట్విట్టర్, మెటా, స్పాటిఫై, మైక్రోసాఫ్ట్ సహా దిగ్గజ టెక్ కంపెనీలు సడన్‌గా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తీసేయడం (Layoffs)తో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇమీడియట్ టర్మినేషన్స్ వల్ల చాలామంది ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీరి బాధని అర్థం చేసుకున్న డ్రీమ్ 11 (Dream 11) సీఈఓ హర్ష్ జైన్ వారందరికీ ఒక గుడ్‌న్యూస్ చెప్పారు. రీసెంట్ టైమ్‌లో భారీ లేఆఫ్స్‌లో భాగంగా ఉద్యోగాలను (Jobs) కోల్పోయిన ఇండియన్స్‌కి జాబ్స్ ఇవ్వడానికి సిద్ధమని హర్ష్ జైన్ తాజాగా ప్రకటించారు.
ఉద్యోగాలు కోల్పోయి బతుకు చీకటిగా మారిన వేళ హర్ష్ జైన్ ఆఫర్ ఉద్యోగులందరికీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. “యూఎస్‌లో 2022లో 52 వేలకు పైగా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. వీరిలో ఉన్న ఉద్యోగులు.. ప్రత్యేకించి వీసా సమస్యలు ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావాలని ప్రచారం చేయండి. రాబోయే దశాబ్దంలో హైపర్-గ్రోత్ సాధించే ఇండియా సామర్థ్యం గురించి భారతీయ టెక్‌కి తెలియజేసేందుకు వీరంతా ఇండియాకి రావాలి.” అని హర్ష్ జైన్ ట్వీట్ చేశారు.
Jobs In DRDO: బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు .. పూర్తి వివరాలిలా..
సాధారణంగా భారతీయులు దిగ్గజ టెక్ కంపెనీలలో ఉద్యోగాలు రాగానే యూఎస్ఎకి తరలిపోతుంటారు. రీసన్ టైమ్స్ లో అలా చాలామంది అక్కడికి వెళ్లిపోయి H1B వీసాతో ట్విట్టర్ , మెటాలో చేరారు. కానీ ఇప్పుడు అనుకోకుండా జాబ్స్ కోల్పోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయాక, వారు మరో 60 రోజులలోపు ఉద్యోగం సంపాదించాల్సి ఉంటుంది. లేకుంటే వారు భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. అయితే హర్ష్ జైన్ సిలికాన్ వ్యాలీలోనే ఉండకుండా భారతీయులను స్వదేశానికి తిరిగి రావాలని.. వారి రెజ్యూమ్‌లను డ్రీమ్ 11కి పంపాలని కోరారు. అతను ఒక ట్విట్టర్ థ్రెడ్‌లో తన కంపెనీలో చేరమని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. డ్రీమ్ స్పోర్ట్స్ గ్రూప్‌లో డ్రీమ్ 11, ఫ్యాన్‌కోడ్, డ్రీమ్ క్యాపిటల్, డ్రీమ్‌సెట్‌గో వంటి మరెన్నో సబ్ బ్రాండ్స్ ఉన్నాయని.. వీటిలో పనిచేయగల ఉద్యోగులు indiareturns@dreamsports.group ద్వారా తమను కాంటాక్ట్ అవ్వచ్చని జైన్ తెలిపారు.
"మా DreamSportsHQ ప్రాఫిటబుల్ కంపెనీ. 150 మిలియన్లకు పైగా యూజర్లతో 8 బిలియన్ డాలర్ల కంపెనీగా ఉంది. ఈ కంపెనీలో ఫాంటసీ స్పోర్ట్స్, NFTs స్పోర్ట్స్ ఓటీటీ, ఫిన్‌టెక్, స్పోర్ట్స్ ఎక్స్‌పీరియన్స్‌లు మొదలైన 10 పోర్ట్‌ఫోలియో కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ డిజైన్, ప్రోడక్ట్ & టెక్‌లో నాయకత్వ అనుభవం ఉన్న గొప్ప ప్రతిభావంతుల కోసం నిరంతరం వెతుకుతున్నాయి.” అని అతను ట్వీట్ చేశారు. తన కంపెనీ Dream11 నిజంగా మంచి కండిషన్‌లో ఉందని.. లాభాల్లోనే నడుస్తోందని.. ఆసక్తి ఉన్నవారు తమ కంపెనీలో చేరితే గ్రోత్ మంచిగా ఉంటుందని జైన్ కోరిన విధానాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. వేరే దేశాల కోసం పనిచేయడం కంటే ఇండియా కోసం పని చేయడానికి భారతీయులు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT jobs, JOBS, Layoffs, Private Jobs