HOME »NEWS »JOBS & EDUCATION »drdo sspl recruitment 2020 defence research and development organisation released notification for 12 posts few vacancies in hyderabad ss

DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం

DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం
DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

DRDO-SSPL Recruitment 2020 | హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డీఆర్‌డీఓకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబరేటరీ-SSPL కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 12 ఖాళీలున్నాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని నియమించనుంది. కొన్ని పోస్టుల్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ కేంద్రంలో భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 15 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన విద్యార్హతలున్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. hrd@sspl.drdo.in మెయిల్ ఐడీకి మెయిల్ పంపి దరఖాస్తు ఫామ్ పొందొచ్చు. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ఇదే మెయిల్ ఐడీకి తిరిగి పంపాల్సి ఉంటుంది.

    DRDO Jobs 2020: డీఆర్‌డీఓ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 4 రోజులే గడువు



    Jobs: మొత్తం 550 ఉద్యోగాల భర్తీకి ఎన్ఎల్‌సీ ఇండియా నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

    DRDO-SSPL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 12
    రీసెర్చ్ అసోసియేట్- 2
    జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్- 10

    DRDO-SSPL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 15
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 15
    విద్యార్హతలు- రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. సెమీకండక్టర్ మెటీరియల్స్, డివైజెస్, ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్‌లో రీసెర్చ్ అనుభవం ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుకు ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో ఎంఎస్సీ ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి. నెట్ క్వాలిఫికేషన్ ఉండాలి.
    వయస్సు- 28 నుంచి 35 ఏళ్లు
    స్టైపెండ్- జేఆర్‌ఎఫ్‌ పోస్టుకు రూ.31,000 + 24% హెచ్ఆర్ఏ. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు రూ.54,000 + 24% హెచ్ఆర్ఏ.
    ఎంపిక విధానం- డీఆర్‌డీఓ కేంద్రంలో ఇంటర్వ్యూ లేదా ఆన్‌లైన్ ఇంటర్వ్యూ
    ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం- సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబరేటరీ, లక్నో రోడ్, తిమార్పూర్, ఢిల్లీ
    దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ- hrd@sspl.drdo.in
    Published by:Santhosh Kumar S
    First published:October 16, 2020, 11:44 IST

    टॉप स्टोरीज