DRDO SCIENTIST B RECRUITMENT 2022 APPLY ONLINE 630 VACANCIES KNOW THE NOTIFICATION FULL DETAILS HERE VB
DRDO Recruitment 2022: DRDOలో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం..
(ప్రతీకాత్మక చిత్రం)
DRDO Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్డీవో(DRDO) రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (DRDO-RAC) సైంటిస్ట్ 'బి' పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
DRDO, DST మరియు ADAలలో సైంటిస్ట్ 'B' పోస్టులకు రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (RAC) తాజా నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. చేసింది. ఇందులో సైటిస్ట్ బి పోస్టులు ఉన్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) అండ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA)లో 630 సైంటిస్ట్ 'B' ఖాళీల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా RAC ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ నంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), డీఎస్టీ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఏడీఏ (ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇది చక్కటి అవకాశం. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు https://drdo.gov.in, https://ada.gov.in, www.dst.gov.inవెబ్ సైట్లను సందర్శించవచ్చు.
DRDO RAC సైంటిస్ట్ B ఖాళీల విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమీషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, సి.సి. , మెటీరియల్ సైన్స్, నావల్ ఆర్కిటెక్చర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అట్మాస్ఫియరిక్ సైన్స్, మైక్రోబయాలజీ మరియు బయోకెమిస్ట్రీ ఇతర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ (BE / B.Tech) (లేదా) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సైన్స్ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులలో చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపిక అనేది రాత పరీక్ష, గేట్ స్కోర్ ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేసి.. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయనున్నారు. ఇంటర్వ్యూకి 1:5 నిష్పత్తిలో పిలుస్తారు. తుది నియామకాల్లో రాతపరీక్షకు 80%, ఇంటర్వ్యూకి 20% వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
Step 1 : అర్హత గల అభ్యర్థులు RAC (రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంట్రల్) వెబ్సైట్ rac.gov.inలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. Step 2 : అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి.. తమ వివరాలను నింపాల్సి ఉంటుంది. Step 2 : అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో, సంతకం మరియు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కార్డ్‌ని కూడా అప్లోడ్ చేయాలి.
ఈ ఆన్లైన్ లో దరఖాస్తుకు నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ జూన్ 21న విడుదల అయింది. దరఖాస్తు ఫీజు.. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి రుసుం లేదు. రాతపరీక్ష తేదీ అక్టోబర్ 16న ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.