డీఆర్‌డీఓ ప్రతీ ఏటా అమ్మాయిలకు రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ఇటీవలే ముగిసింది. అయితే అప్లై చేయలేకపోయినవారికి మరో అవకాశం ఇచ్చింది డీఆర్‌డీఓ. దరఖాస్తు గడువును 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. డీఆర్‌డీఓ ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు రెండుసార్లు అప్లికేషన్ డెడ్‌లైన్ పొడిగించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో పాటు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫలితాలు విడుదల చేయడంలో ఆలస్యమైంది. ఈ కారణాల వల్ల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు అప్లై చేయలేకపోయారు. వారికి ఇప్పుడు మరో అవకాశం లభించింది. విద్యార్థులు 2020 డిసెంబర్ 31 వరకు అప్లై చేయొచ్చు. ఇక ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు అప్లై చేసిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్య చదవలేకపోతున్న విద్యార్థుల కోసం ప్రతీ ఏడాది డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్ అందిస్తోంది. విద్యార్థులు రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ పొందొచ్చు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న 20 మంది అమ్మాయిలకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 10 మంది అమ్మాయిలకు ఈ స్కాలర్‌షిప్స్ ఇస్తోంది డీఆర్‌డీఓ. ఈ స్కీమ్ అమ్మాయిలకు మాత్రమే. స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే అమ్మాయిలు భారతదేశానికి చెందినవారై ఉండాలి.
SBI PO recruitment 2020: ఎస్‌బీఐలో 2000 జాబ్స్... అప్లై చేయండి ఇలా
Private Jobs: ఓ ప్రైవేట్ సంస్థలో 150 ఖాళీలు... APSSDC జాబ్ నోటీస్
ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న అమ్మాయిలకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. 2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పీజీ అడ్మిషన్లు పొందినవారికే ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ వర్తిస్తుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతూ ఉండాలి. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలు అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయొచ్చు.
గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు, JEE (Main) స్కోర్ ఆధారంగా అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు 20 మందిని ఎంపిక చేస్తారు. వారికి ఏటా రూ.1,20,000 వరకు నాలుగేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు ఏటా రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
Bank Jobs 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 647 జాబ్స్‌కి అప్లై చేయండి ఇలా
DRDO: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... రూ.31,000 వేతనంతో డీఆర్‌డీఓలో ఉద్యోగాలు
విద్యార్థినులు డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో https://drdo.gov.in/ లో స్కాలర్‌షిప్ స్కీమ్ వివరాలను తెలుసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్-RAC వెబ్‌సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు చేయాలి. ఈ స్కాలర్‌షిప్ ద్వారా చదువుకునే అమ్మాయిలు డీఆర్‌డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. అన్ని పరీక్షల్లో పాస్ కావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DRDO, Save Girl Child, Scholarship