DRDO: డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్ జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

DRDO Recruitment 2019 | జూన్ 3 లోగా hrd@debel.drdo.in ఇమెయిల్ ఐడీకి అప్లికేషన్ పంపాలి. జూన్ 20న వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అభ్యర్థుల సంఖ్యను బట్టి రాతపరీక్ష ఉంటుంది.

news18-telugu
Updated: May 31, 2019, 1:37 PM IST
DRDO: డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్ జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
DRDO: డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్ జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు (DRDO Logo)
news18-telugu
Updated: May 31, 2019, 1:37 PM IST
డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ బయోఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబరేటరీ(DEBEL), బెంగళూరు సంస్థలో 5 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలున్నాయి. వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 2019 జూన్ 20న వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 28 ఏళ్లలోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. మొదట రెండేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి రూ.25,000 వేతనం, ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తారు. రెండేళ్ల తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అప్‌గ్రేడ్ చేయొచ్చు. డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి

DRDO Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే



నోటిఫికేషన్ ప్రకారం 2 జేఆర్ఎఫ్ పోస్టుల్ని కెమిస్ట్రీలో పీజీ చేసినవారికి కేటాయించారు. పీజీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడంతో పాటు నెట్ క్వాలిఫై కావాలి. బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్ ఫస్ట్ డివిజన్‌లో పాసైనవారు, ఎంఈ, ఎంటెక్ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 1 పోస్టును ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్, బీఈ లేదా ఎంటెక్ చదివినవారికి కేటాయించారు. మరో 2 పోస్టుల్ని లైఫ్ సైన్సెస్, బయోమెడికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీలో పీజీ ఫస్ట్ క్లాస్‌లో పాసైనవారికి కేటాయించారు. నెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి.



ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూన్ 3 లోగా hrd@debel.drdo.in ఇమెయిల్ ఐడీకి అప్లికేషన్ పంపాలి. జూన్ 20న వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అభ్యర్థుల సంఖ్యను బట్టి రాతపరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ జరిగే స్థలం ఇదే.

Raman Main Gate Reception,
DEBEL Compound, DRDO,
Loading...
ADE Campus, CV Raman Nagar,
Suranjan Das Road, Bangalore 560093.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 370 టీచర్ ఉద్యోగాలు... వివరాలివే

SSC MTS Jobs: 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... సిలబస్ ఇదే

Jobs: ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...