హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Notification: పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

Job Notification: పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో(DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో భాగంగా.. టెక్నికల్ కేడర్ కు సంబంధించిన పోస్టులను ఈనోటిఫికేషన్ద్వారా భర్తీ చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో(DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో భాగంగా.. టెక్నికల్ కేడర్ కు సంబంధించిన పోస్టులను ఈనోటిఫికేషన్ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి మరియు టెక్నీషియన్ ఎ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 1901 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 3 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23గా పేర్కొన్నారు. అర్హత, ఖాళీలు, దరఖాస్తు విధానానికి సంబంధించి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.


Constable Last Minute Tips: అభ్యర్థులకు ముఖ్య సూచనలు.. వీటిని తప్పక పాటించండి..


మొత్తం పోస్టుల సంఖ్య.. 1901


సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B (STA-B) మరియు టెక్నీషియన్-A (టెక్-A) పోస్టులతో సహా 1901 DRDO CEPTAM-10 ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ భర్తీ చేస్తుంది.


ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభ తేదీ - 3 సెప్టెంబర్ 2022 దరఖాస్తు చివరి తేదీ - 23 సెప్టెంబర్ 2022


విద్యార్హత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా AICTE గుర్తింపు పొందిన B.Sc డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా కలిగి ఉండాలి.


STA-B పోస్ట్‌లకు దరఖాస్తుకు అర్హత పొందాలంటే.. దరఖాస్తుదారులు సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ లేదా అనుబంధ సబ్జెక్టులలో డిప్లొమా కలిగి ఉండాలి.


టెక్నీషియన్ A: దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమానాన్ని క్లియర్ చేసి ఉండాలి. అంతే కాకుండా.. వారు గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (ITI) నుండి సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి.వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇవ్వబడుతుంది.


ఎంపిక ప్రక్రియ ఈ పోస్టులకు అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండవ దశలో అభ్యర్థులు ట్రేడ్ టెస్ట్ ఇస్తారు. తర్వాత మెరిటి ఆధారంగా డాక్యూమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు.


జీతం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్- బి పోస్టుకు ఎంపికైన వారు 7వ సెంట్రల్ పే కమిషన్ (CPC) పే మ్యాట్రిక్స్ మరియు ఇతర ప్రయోజనాల ప్రకారం రూ. 35,400 మరియు రూ. 1,12,400 మధ్య జీతం పొందుతారు. టెక్నీషియన్ A పోస్ట్ కోసం, ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం మరియు 7వ పే కమీషన్ కింద వర్తించే ఇతర ప్రయోజనాల ద్వారా రూ.19,900 నుండి రూ.63,200 వరకు చెల్లించబడతాయి.


దరఖాస్తు రుసుము జనరల్, OBC మరియు EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.


ఎలా దరఖాస్తు చేయాలి


Step 1: DRDO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి


Step 2: CEPTAM రిక్రూట్‌మెంట్ లింక్‌పైక్లిక్ చేయండి


Step 3: అక్కడ కనిపించే వివరాలను పూర్తిగా చదువుకోండి


Step 4: అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్ ను పూరించండి.


Step 5: భవిష్యత్ అవసరాల కొరకు దరఖాస్తును ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, DRDO, Drdo jobs, JOBS

ఉత్తమ కథలు