DRDO Recruitment 2021: డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. డీఆర్డీఓలో అప్రంటీస్ ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీఆర్డీఓ(DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఖాళీల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    డిఫెన్స్ రీసెర్చ్ & డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ & డాక్యుమెంటేషన్ సెంటర్ (DESIDOC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో 12, కంప్యూటర్ సైన్స్ విభాగంలో మరో 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    -లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సెంటర్ విభాగంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ, డిప్లొమో చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    1. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టులో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థుల కోసం 8 ఖాళీలు కేటాయించారు.
    వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల స్టైఫండ్ చెల్లించనున్నారు.
    2.లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా చేసిన అభ్యర్థుల కోసం మరో 4 ఖాళీలు ఉన్నాయి.
    వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల స్టైఫండ్ చెల్లించనున్నారు.
    IOCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 1968 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

    -కంప్యూటర్ సైన్స్ విభాగంలో మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ (B.E/B.Tech) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల స్టైఫండ్ చెల్లించనున్నారు.
    2.కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల వరకు స్టైఫండ్ చెల్లించున్నారు.
    Jobs in Telangana: తెలంగాణలోని ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఇలా అప్లై చేసుకోండి

    ఇతర పూర్తి వివరాలు..
    -అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఎంప్లాయిమెంట్ న్యూస్ లో అడ్వర్టైజ్మెంట్ వచ్చిన అనంతరం 21 రోజుల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
    -అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
    -అయితే అప్రంటీస్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా http:// portal.mhrdnats.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఏదైనా ఇతర సంస్థలో అప్రంటీస్ షిప్ చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు.
    -2019, అనంతరం పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.

    -అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    -నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    -అప్లికేషన్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
    Published by:Nikhil Kumar S
    First published: