కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్ స్కోర్ ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 20 ఖాళీలను ప్రకటించింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్-CABS కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్డీఓ. ఏరోనాటికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఫెలోషిప్స్ మాత్రమే. రెండేళ్ల తర్వాత మరో రెండేళ్ల వరకు ఫెలోషిప్ పొడిగించే అవకాశం ఉంది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్-CABS సెంటర్లోనే ఫెలోషిప్ ఉంటుంది. ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
DRDO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 20
ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 2
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 5
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 9
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 1
మెకానికల్ ఇంజనీరింగ్- 3
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 30
విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి.
వయస్సు- 28 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
పరిశోధన చేయాల్సిన అంశాలు- ఏరోడైనమిక్స్, స్ట్రక్చరల్ డిజైన్ అనాలిసిస్, రాడార్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెట్వర్కింగ అండ్ డిస్ప్లే సిస్టమ్, మిషన్ కంప్యూటర్, థర్మల్, మేనేజ్మెంట్.
స్టైపెండ్- రూ.31,000 + హెచ్ఆర్ఏ
ఎంపిక విధానం- గేట్ స్కోర్, డిగ్రీ, పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అభ్యర్థులు ముందుగా https://www.drdo.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్స్ సెక్షన్లో సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్-CABS ఫెలోషిప్ నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
డీఆర్డీఓ సూచంచిన ఫార్మాట్లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫామ్‌ను ఇదే వెబ్సైట్లో What's new సెక్షన్లో డౌన్లోడ్ చేయొచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తుల్ని jrf.rectt@cabs.drdo.in మెయిల్ ఐడీకి చివరి తేదీలోగా పంపాలి.
దరఖాస్తు ఫామ్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ కూడా పంపాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.