డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ-DRDL కోసం ఓ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 2021 జూన్ 14 లోగా అప్లై చేయాలి. ఇప్పుడు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న డిఫెన్స్ ల్యాబరేటరీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 47 ఖాళీలను ప్రకటించింది. కార్పెంటర్, వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 5 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు అప్రెంటీస్‌షిప్ ఇండియా పోర్టల్ https://apprenticeshipindia.org/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
DRDO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 47
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 2
మెకానిక్ డీజిల్- 2
కార్పెంటర్- 2
ప్లంబర్- 1
వెల్డర్- 1
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్- 2
టర్నర్- 1
మెషినిస్ట్- 1
ఫిట్టర్- 1
ఎలక్ట్రీషియన్- 1
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 20
స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రెటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)- 8
స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రెటేరియల్ అసిస్టెంట్ (హిందీ)- 2
కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటనెన్స్- 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 5
విద్యార్హతలు- సంబంధిత ట్రేడ్‌లో 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. 2018 కన్నా ముందు ఐటీఐ పాస్ అయినవారు, పీజీ పూర్తి చేసినవారు అర్హులు కాదు.
శిక్షణా కాలం- 12 నెలలు
స్టైపెండ్- రూ.7,000
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంటర్వ్యూలు ఉండవు.
అభ్యర్థులు ముందుగా https://www.drdo.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
అందులో What's new సెక్షన్లో నోటిఫికేషన్ ఉంటుంది.
నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్సైట్లో అప్లై చేయాలి.
దరఖాస్తు ఫామ్‌ను director@dl.drdo.in మెయిల్ ఐడీకి పంపాలి.
https://apprenticeshipindia.org/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయకపోతే దరఖాస్తుల్ని తిరస్కరిస్తారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.