HOME »NEWS »JOBS & EDUCATION »drdo recruitment 2021 defence research and development organisation released notification for 69 posts ss

DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో 69 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో 69 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో 69 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Jobs 2021 | ఉద్యోగాల భర్తీకి డీఆర్‌డీఓ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-IRDE కోసం 69 పోస్టుల్ని ప్రకటించింది. ఇంజనీర్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 69 ఖాళీలున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లో ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అభ్యర్థులు ముందుగా https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటీస్‌లు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్ https://apprenticeshipindia.org/ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి.

    MIDHANI Recruitment 2021: నెల్లూరులోని మిధాని యూనిట్‌లో ఉద్యోగాలు... రూ.72,000 వరకు వేతనం



    Army Recruitment Rally: ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అప్లై చేయండిలా

    DRDO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 69
    మెషినిస్ట్- 2
    టర్నర్- 2
    ఫిట్టర్- 5
    ఎలక్ట్రానిక్ మెకానిక్- 8
    కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 3
    డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 10
    డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 16
    డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 5
    నర్సింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ- 2
    గ్రాడ్యుయేషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 2
    గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 7
    గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 7

    Army Public School Jobs: హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    MIDHANI Recruitment 2021: హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    DRDO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులు
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.
    స్టైపెండ్- టెక్నీషియన్లకు రూ.7000, డిప్లొమా అప్రెంటీస్‌కు రూ.8000, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.9000
    దరఖాస్తు పంపాల్సిన మెయిల్ ఐడీ- cao@irde.drdo.in
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    Director, IRDE,
    Raipur,
    Dehradun-248008
    Published by:Santhosh Kumar S
    First published:January 16, 2021, 16:53 IST

    टॉप स्टोरीज