డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కాన్పూర్‌లో ఉన్న డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్-DMSRDE కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో లాంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు వెళ్లేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. దరఖాస్తు ఫార్మాట్ నోటిఫికేషన్లో ఉంటుంది.
2021 సెప్టెంబర్ 15- రీసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ), జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ) పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
2021 సెప్టెంబర్ 16- జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమికల్ ఇంజనీరింగ్), జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజనీరింగ్) పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
విద్యార్హతలు- రీసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ) ఫోస్టుకు పీహెచ్డీ లేదా తత్సమాన డిగ్రీ పాస్ కావాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ) పోస్టుకు ఫస్ట్ క్లాస్‌లో పీజీ పాస్ కావడంతో పాటు నెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమికల్ ఇంజనీరింగ్), జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజనీరింగ్) పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావడంతో పాటు నెట్, గేట్ స్కోర్ తప్పనిసరి. లేదా ఎంఈ, ఎంటెక్ ఫస్ట్ డివిజన్లో పాస్ కావాలి.
వయస్సు- రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లు. జేఆర్ఎఫ్ పోస్టుకు 28 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్- జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.31,000, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు రూ.54,000.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే వేదిక-
డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్-DMSRDE ట్రాన్సిట్ ఫెసిలిటీ, జీటీ రోడ్, కాన్పూర్.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.