Home /News /jobs /

DRDO RECRUITMENT 2021 DEFENCE RESEARCH AND DEVELOPMENT ORGANISATION RELEASED JOB NOTIFICATION FOR 47 VACANCIES SS GH

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో అప్రెంటీస్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో అప్రెంటీస్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో అప్రెంటీస్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2021 | డీఆర్‌డీఓ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు, అర్హతల వివరాలు తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలు, ఇతర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లాంటి అత్యున్నత సంస్థ నుంచి కొలువుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇందులో ఒక్కసారి ఉద్యోగమొచ్చిందంటే.. మంచి గుర్తింపు, ఆకర్షణీయమైన జీతంతో పాటు అలవెన్సులు కూడా పొందవచ్చు. తాజాగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులు జోధ్‌పూర్‌ డిఫెన్స్ ల్యాబరేటరీలో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్డీఓ (drdo.gov.in) అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ తో పాటు విద్యార్హతకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లను పీడీఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి వాటిని director@dl.drdo.in అనే ఈమెయిల్ అడ్రస్ కు పంపాలి.

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

LIC HFL Recruitment 2021: ఎల్ఐసీ హౌసింగ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

ఈ ఉద్యోగ ప్రకటన విడుదలైనప్పటి నుంచి 15 రోజులలోపు అప్లికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 5న డీఆర్డీఓ అప్రెంటీస్ పోస్టుల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

అర్హత: ఈ అప్రంటీస్ పోస్టు కోసం అభ్యర్థులు కనీసం 10వ తరగతి అర్హత సాధించి ఉండాలి. దీంతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్: ఈ పోస్టులకు అభ్యర్థులను మెరిట్(మార్కుల పర్సెంటేజీ) ఆదారంగా ఎంపిక చేస్తారు. ఆఫర్ లెటర్ ఆధారంగా ఈ విషయాన్ని అర్హత సాధించిన వారికి తెలియజేస్తారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అభ్యర్థులు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ను చెక్ చేసుకోవచ్చు.

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు వాయిదా... కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే

Railway Jobs 2021: సదరన్ రైల్వేలో 3378 జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఇటీవలే 10 ఉద్యోగాలకు ప్రకటన..


ఇటీవలే డీఆర్డీఓ హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీలో(DRDL) ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రకటన ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్-7, ఏరోనాటికల్ లేదా ఏరో స్పేసింగ్ ఇంజినీరింగ్-3 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు నెలవారీ వేతనం రూ.31,000 వరకు ఉంటుంది. జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులకు మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ పోస్టులకు సంబంధిత బ్రాంచిలో బీఈ లేదా బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుకు చివరతేదీ జూన్ 14. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, DRDO, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు