DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 106 ఉద్యోగాలు... ఆ అర్హతలు ఉంటే చాలు

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 106 ఉద్యోగాలు... ఆ అర్హతలు ఉంటే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Apprentice Recruitment 2021 | ఐటీఐ, డిప్లొమా, బీటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారికి అలర్ట్. డీఆర్‌డీఓ 106 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 106 ఖాళీలున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ గడువు ఒక ఏడాది ఉంటుంది. ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ప్రీమియర్ ల్యాబరేటరీ ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్‌లో (ITR) ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 నవంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజున https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 15 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాతే డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

    DRDO Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





















    మొత్తం ఖాళీలు 106
    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 50
    టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ 30
    ట్రేడ్ అప్రెంటీస్ 26

    APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

    DRDO Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 1

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 15 సాయంత్రం 5.30 గంటలు

    విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్, బీఈ పాస్ కావాలి. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

    ఇతర నిబంధనలు- 2019, 2020, 2021 సంవత్సరాల్లో బీఈ, బీటెక్, డిప్లొమా, బీబీఏ, బీకామ్, ఐటీఐ పాస్ అయినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసినవారు దరఖాస్తు చేయకూడదు.

    స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు నెలకు రూ.9,000, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుకు రూ.8,000 స్టైపెండ్ లభిస్తుంది. ఇక ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది.

    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉంటుంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అభ్యర్థులు రిజిస్టర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులు రిజిస్టర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published: