హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DRDO Recruitment 2021: రూ.54,000 వేతనంతో డీఆర్‌డీఓలో జాబ్స్... వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలివే

DRDO Recruitment 2021: రూ.54,000 వేతనంతో డీఆర్‌డీఓలో జాబ్స్... వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2021 | డీఆర్‌డీఓ పలు ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in Interview) నిర్వహిస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఖాళీల భర్తీకి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in Interview) నిర్వహిస్తోంది. కాన్పూర్‌లో ఉన్న డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) కోసం కొద్ది రోజుల క్రితమే జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో లాంటి పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in Interview) నిర్వహిస్తోంది. మొత్తం 4 పోస్టులున్నాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు ముందుగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. జాబ్ నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫార్మాట్ ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్‌తో పాటు ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.

IBM Jobs: ఫ్రెషర్స్‌కి జాబ్ అలర్ట్... ఐబీఎంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు

DRDO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు4
రీసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ)1
జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ)1
జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమికల్ ఇంజనీరింగ్)1
జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజనీరింగ్)1


Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో 1,295 ఉద్యోగాలకు జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ అయితే చాలు

DRDO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


2021 సెప్టెంబర్ 15- రీసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ), జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ) పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

2021 సెప్టెంబర్ 16- జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమికల్ ఇంజనీరింగ్), జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజనీరింగ్) పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

విద్యార్హతలు- రీసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ) ఫోస్టుకు పీహెచ్‌డీ లేదా తత్సమాన డిగ్రీ పాస్ కావాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమిస్ట్రీ) పోస్టుకు ఫస్ట్ క్లాస్‌లో పీజీ పాస్ కావడంతో పాటు నెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలో (కెమికల్ ఇంజనీరింగ్), జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజనీరింగ్) పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావడంతో పాటు నెట్, గేట్ స్కోర్ తప్పనిసరి. లేదా ఎంఈ, ఎంటెక్ ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి.

వయస్సు- రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లు. జేఆర్ఎఫ్ పోస్టుకు 28 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్- జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.31,000, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు రూ.54,000.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే వేదిక-

డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్-DMSRDE ట్రాన్సిట్ ఫెసిలిటీ, జీటీ రోడ్, కాన్‌పూర్.

First published:

Tags: CAREER, DRDO, Govt Jobs 2021, Job notification, JOBS