నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(DRDO) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఢిల్లీలోని తిమర్పూర్ లోని సంస్థ ప్రాంగణంలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. ఐటీఐ అప్రంటీస్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. COPA విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 7 వేలు, ఇతర ట్రేడ్ లలో ఎంపికైన వారికి నెలకు రూ.8,050 చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
విభాగం | ఖాళీలు |
మిషన్ మోటార్ వెహికిల్ | 3 |
Draughtsman | 4 |
ఎలక్ట్రానిక్ మిషన్ | 5 |
లాబరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్) | 6 |
ఇన్ట్రుమెంట్ విషన్ మెకానిక్ | 6 |
కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) | 14 |
విద్యార్హతల వివరాలు..
సంబంధిత విభాగంలో ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 27, ఓబీసీలకు 30 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 32 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఎలా అప్లై చేయాలంటే..
1.అభ్యర్థులు డీఆర్డీఓ నియామకాలకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ rac.gov.in ను ఓపెన్ చేయాలి.
2.అనంతరం ‘CFEES, Delhi invites applications from eligible candidates for apprenticeship training’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
3.కావాల్సిన వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
4.ధ్రువపత్రాల స్కానింగ్ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
5.అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
6. అప్లికేషన్ ఫామ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DRDO, Government jobs, Job notification