DRDO RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR 61 JOB VACANCIES TODAY DEC 20 IS LAST DATE FOR APPLICATIONS NS
DRDO Recruitment 2021: డీఆర్డీఓలో జాబ్స్.. మెరిట్ ఉంటే చాలు ఉద్యోగమే.. దరఖాస్తుకు ఈ ఒక్క రోజే ఛాన్స్..
డీఆర్డీఓలో జాబ్స్.. మెరిట్ ఉంటే చాలు ఉద్యోగమే.. ఇలా అప్లై చేయండి
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ రోజు అంటే డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. సంస్థకు చెందిన Terminal Ballistics Research Laboratoryలో 61 ఖాళీలను అప్రంటీస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఎగ్జామ్ (Exam) లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ (Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా.. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 (stipend) చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్
3
5
మెకానిక్(Embedded Systems and PLC)
1
6
ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్(సివిల్)
1
7
హౌస్ కీపర్
1
8
ఫిట్టర్
7
9
మెషినిస్ట్
4
10
టర్నర్
3
11
కార్పెంటర్
1
12
ఎలక్ట్రీషియన్
8
13
ఎలక్ట్రానిక్స్ మెకానిక్
8
14
మెకానిక్ మోటర్ వెహికిల్
2
15
వెల్డర్
6
16
కంప్యూటర్ పెరిఫిరల్స్ హార్డ్ వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్
2
17
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
3
18
డిజిటల్ ఫొటోగ్రాఫర్
3
19
సెక్రెటేరియల్ అసిస్టెంట్
3
20
స్టేనోగ్రాఫర్
1
ఎలా అప్లై చేయాలంటే.. Step 1:అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. Step 2:అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి అన్ని కావాల్సిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. Step 3:అనంతరం అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ పాస్ సర్టిఫికేట్&మార్క్స్ షీట్, కాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ స్కానింగ్ కాపీలను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ లో admintbrI@tbrl.drdo.in మెయిల్ లో పంపించాల్సి ఉంటుంది. Step 4: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. Central Railway Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్
ఎంపిక ఎలా చేస్తారంటే..
-అభ్యర్థులు విద్యార్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడుతారు.
-ఒక వేళ మార్కులు సమానంగా ఉంటే కింది తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు.
-ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా ట్రైనింగ్ కు సంబంధించిన సమాచారం ఇస్తారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.