నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్-RCI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ హైదరాబాద్‌లో ఉంది. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4 ఖాళీలున్నాయి. అవసరాన్ని బట్టి నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఇవి రెండేళ్ల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఎంపికైన వారికి రూ.54,000 స్టైపెండ్ లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 22 చివరి తేదీ. అభ్యర్థులకు సెప్టెంబర్ 28న ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rcilab.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
Degree Fellowship: డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5,000... అప్లై చేయండిలా
SAIL Recruitment 2020: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు ఇవే
DRDO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు
రీసెర్చ్ అసోసియేట్ మొత్తం ఖాళీలు- 4
దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 22
ఇంటర్వ్యూ- 2020 సెప్టెంబర్ 28
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
వయస్సు- 35 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:September 15, 2020, 11:00 IST