DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

DRDO Recruitment 2020 | బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పాసైనవారికి శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO 185 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

news18-telugu
Updated: May 22, 2020, 7:16 AM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు మొదట ప్రకటించింది. వీటికి మరో 18 పోస్టుల్ని కలుపుతున్నట్టు తాజాగా వెల్లడించింది. దీంతో పోస్టుల సంఖ్య 185 కి పెరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 22న అంటే ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 185
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 41
మెకానికల్ ఇంజనీరింగ్- 43
కంప్యూటర్ సైన్స్- 32
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12మెటల్లార్జీ- 10
ఫిజిక్స్- 8
కెమిస్ట్రీ- 7
కెమికల్ ఇంజనీరింగ్- 6
ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 9
సివిల్ ఇంజనీరింగ్- 3
మ్యాథమెటిక్స్- 4
సైకాలజీ- 10

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మే 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 10
విద్యార్హత- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: బీటెక్ అర్హతతో 259 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 1343 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: కరోనా వైరస్ సంక్షోభంలో ఇండియాలో ఈ 10 స్కిల్స్‌కు ఫుల్ డిమాండ్

 
First published: May 22, 2020, 7:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading