Home /News /jobs /

DRDO RECRUITMENT 2020 DEFENCE RESEARCH AND DEVELOPMENT ORGANISATION INVITES APPLICATIONS FOR 18 JRF POSTS IN HYDERABAD AND BANGALORE SS

DRDO Jobs: హైదరాబాద్ డీఆర్‌డీఓలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

DRDO Jobs: హైదరాబాద్ డీఆర్‌డీఓలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

DRDO Jobs: హైదరాబాద్ డీఆర్‌డీఓలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2020 | హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ కేంద్రంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. పలు పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

    కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌-DRDO ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. డీఆర్‌డీఓకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబరేటరీ-SSPL కోసం 18 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ మెటీరియల్, డివైజెస్ విభాగాల్లో పరిశోధన చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్‌లో ఫెలోషిప్ చేయొచ్చు. 13 ఫెలోషిప్స్‌ని డీఆర్‌డీఓ అందిస్తుంది. 5 ఫెలోషిప్స్‌కి సొంతగా ఖర్చు పెట్టుకోవాలి. ఇవి తాత్కాలికంగా భర్తీ చేస్తున్న పోస్టులే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 14 చివరి తేదీ. ఎంపికైనవారిని హైదరాబాద్‌లోని గాలియం ఆర్సనైడ్ ఎనేబ్లింగ్ టెక్నాలజీ సెంటర్-GAETEC, బెంగళూరులోని సెమీకండక్టర్ టెక్నాలజీ అప్లైడ్ రీసెర్చ్ సెంటర్-STARC యూనిట్లలో నియమించనుంది. వారికి రూ.31,000 వేతనం లభిస్తుంది.

    DRDO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 18
    విద్యార్హత- ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‌లో ఫస్ట్ డివిజన్‌లో ఎంఎస్సీ పాస్ కావాలి. నెట్ (లెక్చరర్‌షిప్) క్వాలిఫికేషన్ ఉండాలి.
    వయస్సు- 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ప్రక్రియ- hrd@sspl.drdo.in లేదా sspldelhihr@gmail.com ఇమెయిల్ ఐడీలకు వివరాలు పంపించి దరఖాస్తు ఫామ్ పొందొచ్చు
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 14
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    LIC Jobs 2020: ఎల్ఐసీలో 218 జాబ్స్... మార్చి 15 చివరి తేదీ

    SSC Recruitment 2020: మొత్తం 1157 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత

    ISRO Jobs: ఇస్రోలో 183 జాబ్స్... మార్చి 6 లాస్ట్ డేట్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, DRDO, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు