DRDO: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... ఖాళీల వివరాలివే

DRDO Recruitment 2020 | హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. కాంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 11, 2020, 12:43 PM IST
DRDO: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... ఖాళీల వివరాలివే
DRDO: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ కేంద్రంలో ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబరేటరీ-ASL కోసం ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 60 ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులున్నాయి. మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది డీఆర్‌డీఓ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలివే



మొత్తం ఖాళీలు- 60

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 20
డిగ్రీ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్- 3
డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 3
డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 2డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 4
డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 8

టెక్నీషియన్ అప్రెంటీస్- 20
డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 2
డిప్లొమా ఇన్ ఎలక్ట్రిలక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 4
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 4
డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 10

ట్రేడ్ అప్రెంటీస్- 20
సీఎన్‌సీ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్- 2
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 2
ఎలక్ట్రీషియన్- 6
ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్ ప్రాసెసర్- 2
ఫిట్టర్- 8

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 20
దరఖాస్తు విధానం- గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు ముందుగా http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు http://ncvtmis.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి.
ఎంపిక విధానం- మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్-
The Director, Advanced Systems Laboratory,
Dr A.P.J, Abdul Kalam Missile Complex,
Defence Research & Development Organisation,
PO Kanchanbagh, Hyderabad 500058.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో 122 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

BSNL Jobs: బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: రైల్వేలో 2792 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
First published: March 11, 2020, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading