DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

DRDO Recruitment 2020 | డీఆర్‌డీఓ ఇటీవల విడుదల చేసిన 311 పోస్టులకు దరఖాస్తు చేయలేకపోయినవారికి శుభవార్త. దరఖాస్తు గడువు పొడిగించింది డీఆర్‌డీఓ.

news18-telugu
Updated: July 10, 2020, 2:11 PM IST
DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు
DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO 311 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు జూలై 10న అంటే ఇవాళ ముగుస్తుందని గతంలోనే ప్రకటించింది డీఆర్‌డీఓ. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అప్లై చేయలేనివారికి మరో అవకాశం ఇచ్చింది. ఆగస్ట్ 17 వరకు గడువు పొడిగించింది. దీంతో అభ్యర్థులకు దరఖాస్తు చేయడానికి మరో నెల రోజులు గడువు ఉంది. ఇక ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే మొదట కేవలం 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని మాత్రమే ప్రకటించింది డీఆర్‌డీఓ. కానీ తర్వాత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA కోసం 18 పోస్టుల్ని కలుపుతున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత మరో 126 కొత్త పోస్టుల్ని కలిపింది. దీంతో ఖాళీల సంఖ్య 311 కు పెరిగింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్

Police Jobs: మొత్తం 1564 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 311
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81
మెకానికల్ ఇంజనీరింగ్- 82కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12
మెటల్లార్జీ- 10
ఫిజిక్స్- 14
కెమిస్ట్రీ- 7
కెమికల్ ఇంజనీరింగ్- 11
ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17
సివిల్ ఇంజనీరింగ్- 3
మ్యాథమెటిక్స్- 4
సైకాలజీ- 10

Nestle Internship: ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్... 1,000 మందికి అవకాశం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 723 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మే 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 17 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.
వేతనం- నెలకు రూ.80,000
Published by: Santhosh Kumar S
First published: July 10, 2020, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading