DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2020 | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కేరళలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రఫిక్ ల్యాబరేటరీ పలు పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

news18-telugu
Updated: February 4, 2020, 3:26 PM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కేరళలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రఫిక్ ల్యాబరేటరీలో 41 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మార్చి 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్న అడ్రస్‌లో జరిగే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. అభ్యర్థులు ముందుగా https://apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి.

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 41

ఫిట్టర్- 4
టర్నర్- 2
మెషినిస్ట్- 3


డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్- 11టూల్ అండ్ డై మేకర్- 1
ఇంజెక్షన్ మౌల్డింగ్ మెషీన్ ఆపరేటర్- 1
వెల్డర్- 2
ఎలక్ట్రానిక్ మెకానిక్- 6
ఎలక్ట్రీషియన్- 3
COPA- 3
సెక్రెటేరియల్ అసిస్టెంట్- 1
ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్- 4

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఇంటర్వ్యూ జరిగే తేదీ- ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్, టూల్ అండ్ డై మేకర్, ఇంజెక్షన్ మౌల్డింగ్ మెషీన్ ఆపరేటర్, వెల్డర్ పోస్టులకు 2020 మార్చి 11న, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, COPA, సెక్రెటేరియల్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 2020 మార్చి 12న ఇంటర్వ్యూలు జరుగుతాయి.
స్టైపెండ్- ఏడాది ఐటీఐ హోల్డర్లకు రూ.7,700. రెండు, మూడేళ్ల ఐటీఐ హోల్డర్లకు రూ.8,050.
ఇంటర్వ్యూ జరిగే అడ్రస్:
DROMI,
Naval Physical and Oceanographic Laboratory,
landmark – Near SBI NPOL Thrikkakara Branch, Kochi.

నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: స్పోర్ట్స్ అథారిటీలో 347 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: మూడు నోటిఫికేషన్లు... 3967 ఉద్యోగాలు... ఫిబ్రవరి 6 లాస్ట్ డేట్

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే
First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు