DRDO Jobs: డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2020 | ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినవారికి శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 1, 2020, 1:27 PM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
DRDO Jobs: డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొదట 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA కోసం 18 పోస్టుల్ని కలుపుతున్నట్టు ప్రకటించింది. దీంతో పోస్టుల సంఖ్య 185 కి పెరిగింది. ఇప్పుడు మరిన్ని పోస్టుల్ని ఇదే నోటిఫికేషన్‌లో కలిపింది. 126 కొత్త పోస్టుల్ని ప్రకటించడంతో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్య 311 కు పెరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 311
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81
మెకానికల్ ఇంజనీరింగ్- 82
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12మెటల్లార్జీ- 10
ఫిజిక్స్- 14
కెమిస్ట్రీ- 7
కెమికల్ ఇంజనీరింగ్- 11
ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17
సివిల్ ఇంజనీరింగ్- 3
మ్యాథమెటిక్స్- 4
సైకాలజీ- 10

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మే 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 10 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Military College Admissions: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు... జూన్ 15 చివరి తేదీ

TCS iON: గుడ్ న్యూస్... టీసీఎస్ నుంచి ఉచితంగా స్కిల్ ట్రైనింగ్

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 1, 2020, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading