DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

DRDO Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబరేటరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 5, 2020, 12:59 PM IST
DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO నోటిఫికేషన్ విడుదల చేసింది. చెన్నైలోని డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4 ఖాళీలున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలో డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబరేటరీలను కొత్తగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని యంగ్ సైంటిస్ట్ ల్యాబరేటరీలో ఖాళీల భర్తీ జరుగుతోంది. ప్రస్తుతానికి 4 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల్ని డీఆర్‌డీఓ ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

DRDO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...



మొత్తం జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు- 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 30
విద్యార్హతలు- కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి. యూజీసీ నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్ తప్పనిసరి.
వయస్సు- 28 ఏళ్ల లోపు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:The Director,
DRDO Young Scientist Laboratory Cognitive Technology,
Defence Research and Development Organisation (DRDO),
5th Floor IITM Research Park,
Kanagam Road Taramani,
Chennai 600113.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 3,795 ఉద్యోగాలు... వివరాలివే

Jio Internship: విద్యార్థులకు గుడ్ న్యూస్... రిలయెన్స్ జియో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చేయండిలా

Railway Jobs: రైల్వేలో 617 టికెట్ క్లర్క్, లోకో పైలట్, జేఈ జాబ్స్.. ఖాళీల వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 5, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading