DRDO Recruitment 2020: డీఆర్డీఓ హైదరాబాద్ లో ఉద్యోగాలు.. రూ. 54 వేల వరకు వేతనం

నిరుద్యోగులుకు డీఆర్డీఓ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ మెటలర్జికల్ లాబరేటరీ(DMRL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 54 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

news18-telugu
Updated: October 29, 2020, 11:31 AM IST
DRDO Recruitment 2020: డీఆర్డీఓ హైదరాబాద్ లో ఉద్యోగాలు.. రూ. 54 వేల వరకు వేతనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులుకు డీఆర్డీఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక నియామకాలు చేపడుతున్న ఈ సంస్థ తాజాగా హైదరాబాద్ లోని డిఫెన్స్ మెటలర్జికల్ లాబరేటరీ(DMRL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 నూతన నియామకాలను చేపట్టారు. వీరిని తాత్కాలిక పద్ధతిలో నియమించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 54 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. మొత్తం 21 పోస్టులలో 18 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు కాగా.. మరో మూడు రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు.

అర్హతల వివరాలివే..

-JRF in metallurgy or material science- ఈ విభాగంలో మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. BE/BTech మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయిన వారు అర్హులు.
-JRF in physics, JRF in chemistry విభాగాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేయనున్నారు. ఆయా కోర్సుల్లో ఫస్ట్ డివిజన్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-JRF in mechanical ఈ విభాగంలో మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో బీ.టెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-RA in metallurgy or material science ఈ విభాగంలో ఒక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు.
-RA in physics, RA in chemistry విభాగాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేస్తున్నారు. ఎమ్మెస్సీ ఫస్ట్ డివిజన్ లో పాసై మూడేళ్ల అనుభవం ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.

గేట్, యూజీసీ, సీఎస్ఐఆర్-నెట్ లలో మంచి స్కోర్ సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 28 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు వమోపరిమితిని సడలించారు.

Official Notification-Direct Link

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు డీఆర్డీఓ వెబ్ సైట్లో ఉన్న ఫార్మాట్ ఆధారంగా ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇతర సూచించిన సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను సైతం admin@dmrl.drdo.in మెయిల్ అడ్రస్ కు జనవరి 2, 2021 లోగా పంపించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 29, 2020, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading