DRDO Recruitment 2020: డీఆర్డీఓలో రూ. 54 వేల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

DRDO Recruitment 2020: డీఆర్డీఓ మరో నియామకాన్ని చేపట్టింది. ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్, రీసర్చ్ డెవలప్ మెంట్ విభాగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: October 27, 2020, 1:45 PM IST
DRDO Recruitment 2020: డీఆర్డీఓలో రూ. 54 వేల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డీఆర్డీఓ మరో నియామకాన్ని చేపట్టింది. ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్, రీసర్చ్ డెవలప్ మెంట్ విభాగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులను తాక్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ. 54 వేల నుంచి రూ. 31 వేల వరకు ఉపకారవేతనం రూపంలో చెల్లించనున్నారు. నోటిఫికేషన్లో మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో మూడు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు కాగా.. మరో మూడు పోస్టులను రీసెర్చ్ ఫెలో లతో భర్తీ చేయనున్నారు.

విద్యార్హతల వివరాలివే..

Research Associate in mechanical engineering, mechanical (simulation) or material science విభాగంలో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు. PhD లేదా అందుకు సమానమైన అర్హత కలిగిన మెకానికల్ లేదా మెటీరియల్ సైన్స్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలను నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు. Research Associate in physics ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. ఇందుకు PhD లేదా ఫిజిక్స్ సబ్జెక్టులో అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు అర్హులు. Junior research fellow in material science ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. మెటీరియల్ సైన్స్ లో ఎమ్మెస్సీ ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యి నెట్ లేదా బీఈ లేదా బీటెక్ లలో ఏదో ఒక డిగ్రీలో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయిన వారు అర్హులు.

Junior research fellow in electrical విభాగంలో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. బీఈ, బీటెక్ ఎలక్ట్రికల్ సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీంతో పాటు నెట్, గేట్, ఎంఈ, ఎంటెక్ లలో ఫస్టు క్లాసులో ఏదో ఒకటి పూర్తి చేయాల్సి ఉంటుంది. Junior research fellow in electronics and communication engineering విభాగంలోనూ ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ లో బీఈ లేదా బీటెక్ లో ఫస్ట్ డివిజన్ లో పాసైన వారు అర్హులు. దీంతో పాటు నెట్, గేట్, ఎంఈ, ఎంటెక్ లలో ఏదో ఒకటి ఎలక్ట్రానిక్స్ ఎండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని పోస్టులకు మిగతా పూర్తి విద్యార్హతలను నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Official Notification
ఎలా దరఖాస్తు చేయాలంటే..
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ను సూచించిన ఫార్మాట్ లో, విద్యార్హతల సర్టిఫికేట్లతో కలిపి admintbrl@tbrl.drdo.in మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 13ను గడువుగా నిర్ణయించారు. ఇంటర్వ్యూలను వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 27, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading