DRDO Junior Research Fellowship-JRF Recruitment 2019 | మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఫస్ట్ డివిజన్లో పూర్తి చేసిన ఇంజనీర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. NET/GATE స్కోర్ తప్పనిసరి.
మిషన్ శక్తి... రెండ్రోజులుగా భారతదేశంలో చర్చనీయాంశమైన టాపిక్. యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌ను విజయవంతంగా పరీక్షించి... అంతరిక్షంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిన ఘనత మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO పరిశోధకులకు దక్కుతుంది. మరి మీరు కూడా అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా? జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF) కోసం దరఖాస్తుల్ని డీఆర్డీఓ ఆహ్వానిస్తోంది. విశాఖపట్నంతో పాటు చండీగఢ్, కాన్పూర్‌లోని డీఆర్డీఓకు చెందిన మూడు సెంటర్లలో మొత్తం 14 జేఆర్ఎఫ్ పోస్టులున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఫస్ట్ డివిజన్లో పూర్తి చేసిన ఇంజనీర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. NET/GATE స్కోర్ తప్పనిసరి. ఎంఈ, ఎంటెక్ హోల్డర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకోండి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో(DRDO-SASE, చండీగఢ్)- 5 ఖాళీలు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం: చండీగఢ్
తేదీ: 2019 ఏప్రిల్ 30
వయస్సు: 28 ఏళ్ల లోపు, రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు
వేతనం: రూ.25,000
జూనియర్ రీసెర్చ్ ఫెలో(DRDO-NSTL, విశాఖపట్నం)- 5 ఖాళీలు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం: విశాఖపట్నం
తేదీ: 2019 మే 15
వయస్సు: 28 ఏళ్ల లోపు, రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు
వేతనం: రూ.25,000
జూనియర్ రీసెర్చ్ ఫెలో(DRDO-DMSRDE, కాన్పూర్)- 4 ఖాళీలు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ
వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం: కాన్పూర్
తేదీ: 2019 ఏప్రిల్ 10, 11
వయస్సు: 28 ఏళ్ల లోపు, రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు
వేతనం: రూ.25,000
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.