హైదరాబాద్లోని నిరుద్యోగులకు శుభవార్త. పలు ఖాళీల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో (RCI) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 7 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
DRDO RCI Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 7
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు విధానం- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ అభ్యర్థులు http://www.mhrdnats.gov.in/ వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత డీఆర్డీఓ వెబ్సైట్లో అప్లై చేయాలి. బీఎస్సీ, బీకామ్ అభ్యర్థులు నేరుగా అర్హతలు ఉన్నవారు https://rcilab.in/ వెబ్సైట్లో అప్లై చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.