• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • DRDO PXE APPRENTICE RECRUITMENT 2021 DEFENCE RESEARCH AND DEVELOPMENT ORGANISATION RELEASED NOTIFICATION FOR 62 VACANCIES SS

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

DRDO Recruitment 2021 | డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్-PXE కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. డిప్లొమా, ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 69 ఖాళీలు ఉన్నాయి. ఒడిషాలోని బాలాసోర్‌లో గల డీఆర్‌డీఓ ప్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యూనిట్లో ఈ ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 27 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు అబ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS, ఐటీఐ అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌‌షిప్ ప్రమోషన్ స్కీమ్-NAPS పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి.

    DRDO PXE Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 62

    టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్- 39
    డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ- 2
    డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 2
    డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 14
    డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 4
    డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 1
    డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 7
    డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‍స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 1
    డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 7
    డిప్లొమా ఇన్ సర్వే ఇంజనీరింగ్- 1

    Railway Jobs: భారతీయ రైల్వేలో ఉద్యోగాలు... టెన్త్ నుంచి డిగ్రీ వరకు అర్హత

    RBI Recruitment 2021: ఆర్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    ఐటీఐ అప్రెంటీస్-23
    ఐటీఐ ఇన్ ఫిట్టర్- 7
    ఐటీఐ ఇన్ డీజిల్ మెకానిక్- 1
    ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్- 3
    ఐటీఐ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 4
    ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్- 2
    ఐటీఐ ఇన్ వెల్డర్- 2
    ఐటీఐ ఇన్ టర్నర్- 2
    ఐటీఐ ఇన్ మెషినిస్ట్- 2

    PNB Recruitment 2021: ఇంటర్ పాస్ అయినవారికి బ్యాంకులో ప్యూన్ ఉద్యోగాలు

    BRO Recruitment 2021: బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

    DRDO PXE Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 27
    విద్యార్హతలు- సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ పాస్ కావాలి.
    స్టైపెండ్- డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు నెలకు రూ.8,000. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు నెలకు రూ.7,000.
    దరఖాస్తు విధానం- డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి director@pxe.drdo.in మెయిల్ ఐడీకి 2021 ఫిబ్రవరి 27 లోగా పంపాలి.
    Published by:Santhosh Kumar S
    First published: